Header Banner

నేను కూడా సాధారణ ప్రేక్షకుడ్నే... ఆ సినిమాల కోసం వేచి చూస్తున్నా.! రాజమౌళి కామెంట్స్ వైరల్..

  Mon Apr 14, 2025 11:14        Entertainment

రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుంది. ఈ విషయాన్ని ఎవరినడిగినా చెబుతారు. అలాంటిది రాజమౌళి మాత్రం మూడు సినిమాల కోసం వేచి చూస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయింది. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా, ప్రస్తుతం ఫారిన్‌లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా ఓ ప్రేక్షకుడిగా కొన్ని సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్', ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న మూవీ 'స్పిరిట్‌'తో పాటు రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న 'పెద్ది' మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి చెప్పారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

ఈ మూడూ పాన్ ఇండియా మూవీలే కావడంతో ఎలా ఉంటాయో అనే ఆతృత తనకు కూడా ఉందని ఆయన అన్నారు. ఈ మూవీలపై రాజమౌళి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయా మూవీ హీరోల అభిమానులు సంతోషపడుతున్నారు. ఇక ఈ మూవీల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ 'డ్రాగన్' షూటింగ్‌ దశలో ఉంది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ప్రభాస్ – సందీప్ కాంబో మూవీ 'స్పిరిట్'కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి సంబంధించి ఇటీవలే గ్లింప్స్ విడుదలయ్యాయి. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుండగా, ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia